గూగుల్‌కు రష్యా అతి భారీ జరిమానా
గూగుల్‌కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమ దేశ యూట్యూబ్ ఛానల్స్‌పై వేటు వేసినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్ రష్యన్ రూబుళ్ల భారీ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కంటే ఎక్కువ. ఒక అన్‌డెసిలియన్ అంటే 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయి. ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్ డాలర్ల కంటే కూడా ఇది అధికం. అంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టడం గూగుల్‌కు సాధ్యం కాదు.