ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్.. రాయితీ పొందండిలా

64చూసినవారు
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్.. రాయితీ పొందండిలా
AP: రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఏడాదిలో 4 నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ చొప్పున తొలి విడతగా ఈ నెల 31 వరకు బుక్ చేసుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.2,452 రాయితీ ఇస్తోంది. అయితే కొందరికి రాయితీ డబ్బులు జమ కావడం లేదు. ఏమైనా సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల్లో ఈకేవైసీ అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌లో రాయితీ డబ్బులు అకౌంట్లో పడతాయన్నారు.

సంబంధిత పోస్ట్