
ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరే?
AP: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు కానుందని తెలుస్తోంది. ఆయనతో పాటు టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.