కొరిశపాడు: పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన మస్తాన్ ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో రవికుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భయపడవద్దని అండగా ఉంటానని, ప్రభుత్వం నుంచే వచ్చే సహకారం అందేలా చూస్తానని మంత్రి రవికుమార్ వారికి భరోసా ఇచ్చారు.