విజయమ్మ రాసిన లేఖపై స్పందించిన షర్మిల
వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతీ హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతీ ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన అంటూ తల్లి లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, జగన్‌కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్సార్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆమె లేఖ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.