భవిష్యత్తు లక్ష్యంగా జనసేనను బలోపేతం చేస్తాం: నాదెండ్ల
జనసేన ప్రజల పార్టీ అని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తామన్నారు. తెనాలిలో ఓడిపోయినా... ప్రజల పక్షాన నిలబడతానన్నారు. నియోజక వర్గంలో విజయం సాధించిన వైకాపా అభ్యర్థి అన్నా బత్తుని శివకుమార్‌కు మనోహర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.