

సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు: చంద్రబాబు (వీడియో)
AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే మీకు చివరి రోజు అంటూ హెచ్చరించారు. చేతనైతే సమాజానికి విలువలు నేర్పించాలని, పిల్లలకు నేరాలు, రౌడీయిజం నేర్పించడం మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు.