AP: గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్ది మంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదన్నారు. దురుద్దేశంతో కొంత మంది ఫోటోలు షేర్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు.