
10వ బిడ్డకు జన్మనిచ్చిన 66 ఏళ్ల బామ్మ
ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు PCOD, PCOS వంటి రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్నామని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్మనీకి చెందిన ఆలెగ్జాండ్రా హెల్డెబ్రాండ్ అనే మహిళ 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె బెర్లిన్లోని చారిటే ఆసుపత్రిలో ఫిలిప్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ బిడ్డ బరువు 3 కిలోల 175 గ్రాములు. కాగా, ఆలెగ్జాండ్రా తొలి బిడ్డకు ఇప్పుడు 50 ఏళ్లు.