హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. రక్షణ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.