హీరో ధనుష్‌పై నయనతార సంచలన వ్యాఖ్యలు
సినీ హీరో ధనుష్‌పై నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ థాన్' (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా పాటలు ఉపయోగించుకోవడానికి దానికి నిర్మాత అయిన ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదన్నారు. దీని కోసం రెండేళ్లు వేచి చూశామన్నారు. దీనిపై తనకు ధనుష్ రూ.10 కోట్లకు లీగల్ నోటీసులు పంపించారని ఫైర్ అయ్యారు. తండ్రి, సోదరుడి సాయంతో ధనుష్ హీరో అయ్యారని, తాను రెక్కల కష్టం మీద పైకొచ్చానని అన్నారు.