సాంబారు గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. గోనెగండ్ల లో శుక్రవారం ఓ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి గద్వాల జిల్లా, పైపాడు గ్రామానికి చెందిన వీరేశ్ తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. కాగా వీరేశ్ కుమారుడు జగదీశ్(6) సెల్‌ఫోన్‌తో ఆడుకుంటూ అక్కడే ఉన్న సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత జారిపోవడంతో వేడి సాంబారులో పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.