బీజేపీపై సీఎం సంచలన వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున బీజేపీ ఇవ్వజూపిందని ఆరోపణలు చేశారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కమలం పార్టీ బుట్టలో పడలేదని పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు పనులు చేయడం బీజేపీకి కొత్తేమే కాదని విమర్శించారు.