
అవనిగడ్డ: డిఎస్సీ అభ్యర్థుల సంబరాలు
అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేయటం హర్షణీయమని డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలోని విద్యానికేతన్ డీఎస్సీ శిక్షణ కేంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.