ఘంటసాల: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
కృష్ణా నదిలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక, బుసక తరలిస్తే చర్యలు తప్పవని తహశీల్దార్ విజయ ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక, బుసక తరలించడానికి వీల్లేదని బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.