అల్లు అర్జున్ కేసు విచారణ వాయిదా
అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన విచారణను సోమవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు పీపీ సమయం కోరడంతో కోర్టు సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టు విచారించింది. అన్నింటిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.