రేపే నామినేషన్.. రేసులో పలువురు టీడీపీ నేతలు
AP: నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి టీడీపీలో పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. గుంటూరు జిల్లాలో 259 నీటి సంఘాలు, 30 డీసీలు, ప్రకాశం జిల్లాల్లో 148 నీటి సంఘాలు, 18 డీసీలు ఉన్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు వీటిని ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.