AP: ఉద్యోగాలకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గురువారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌లో ఒక పాలసీ తెచ్చాం. 5 లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, తదితర కాన్సెప్టుల్లో ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల గుర్తించాలి. దాంతో వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టవచ్చు. ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.’ అని అన్నారు.