తొక్కిసలాట ఘటన.. సంధ్య థియేటర్ క్లోజ్?
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ లైసెన్స్‌పై పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో థియేటర్‌ను క్లోజ్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 'పుష్ప-2' బృందం వస్తుందని పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడంపై పోలీసులు కాస్త గుర్రుగా ఉన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు, భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, పార్కింగ్ సమస్య, టికెట్ వెరిఫికేషన్ సిస్టమ్ లేకపోవడం.. ఇలా చాలా సమస్యలు ఉన్నట్లు తెలిపారు.