చచ్చిన బతికినా గుడివాడలోనే: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము

23415చూసినవారు
చచ్చిన బతికినా గుడివాడలోనే: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము
చచ్చిన బతికినా గుడివాడలోనే ఉంటానని గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో వైసీపీ నేతలైన డోకిపర్రు గ్రామ సర్పంచ్ జ్యోతి,వార్డు సభ్యురాలు,కీలక వైసీపీ నేతలు టీడీపీ లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడతో తనకు విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానిపై సొంత పార్టీ నేతలే విరక్తితో ఉన్నారని అన్నారు. గుడివాడ లో మొత్తానికి వార్ వన్ సైడ్ అయిందని అన్నారు. పుట్టిన గడ్డకోసం ఏదో ఒక చేయాలనే రాజకీయాల్లో వచ్చానని కష్టపడి సంపాదించిన ఎన్నో ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఆదరించి గెలిపించాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్