ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో మాజీ జెడ్పిటిసి మృతి
ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామం టిడిపి అనుచరుడు, మాజీ జెడ్పిటిసి చాంద్ భాషా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆళ్లగడ్డ నుండి తమ సొంత గ్రామమైన కోట కందుకూరుకు బైక్ లో వెళుతుండగా కర్నూలు కడప జాతీయ రహదారి పై పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. హుటాహుటిన 108 అంబులెన్స్ లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.