Jan 29, 2025, 01:01 IST/
రథసప్తమి.. సర్వదర్శనం టికెట్లు నిలిపివేత
Jan 29, 2025, 01:01 IST
తిరుమలలో ఫిబ్రవరి 04న మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3– 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.