సీఎం చంద్రబాబు ఓర్వకల్లు పర్యటన రద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఓర్వకల్లు పర్యటన రద్దు అయ్యిందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో ఉండగా వర్షాల కారణంగా రద్దు చేసుకుని, పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో నిర్వహించేందుకు ఆధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో సీఎం పర్యటన రద్దు అయ్యిందన్నారు.