సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం: చంద్రబాబు (వీడియో)
AP: రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సాహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. ‘ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి.’ అని చంద్రబాబు అన్నారు.