దారుణం.. కుమార్తెను కిడ్నాప్ చేసి రూ. 3లక్షలకు అమ్మిన వడ్డీ వ్యాపారి
గుజరాత్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సబర్కాంత జిల్లాకి చెందిన వడ్డీ వ్యాపారి అర్జున్‌నాథ్ వద్ద.. కొద్దీకాలం కిందట ఓ వ్యక్తి రూ.60 వేలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీతో కలిపి రూ.3 లక్షలు అయిందని, మొత్తం తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారి డిమాండ్ చేశాడు. అనంతరం అతడి ఏడేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి.. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 19న రూ.3 లక్షలకు అమ్మేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను కాపాడారు.