సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయారనే విషయం తనకు ముందుగా తెలియదని నిన్న అల్లు అర్జున్ చెప్పారు. అయితే మహిళ చనిపోయిందని చెప్పి తామే ఆయనను థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చామని పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. పర్మిషన్ ఇస్తేనే వెళ్లానని బన్నీ చెప్పగా, ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. తొక్కిసలాట విషయం తెలిసి సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయానని హీరో తెలపగా.. సుమారు రా.12 గంటలకు వెళ్లారని పోలీసులు వెల్లడించారు.