Oct 13, 2024, 12:10 IST/
గన్తో కాల్చుకుని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Oct 13, 2024, 12:10 IST
TG: మహబూబాబాద్ కలెక్టరేట్లో గన్తో కాల్చుకుని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాస్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ పరిశీలించారు.