Oct 14, 2024, 02:10 IST/కరీంనగర్
కరీంనగర్
రాములపల్లిలో రోడ్డు ప్రమాదం
Oct 14, 2024, 02:10 IST
కొత్తపల్లి మండలం రాములపల్లిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బావుపేట నుంచి చింతకుంటకు బైకుపై వెళుతున్న తండ్రి కొడుకులు ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకుకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.