ప్రమాదకరంగా ఉప్పు వాగు వంతెన
నెల్లూరు జిల్లాలోని ఓ వంతెన ప్రమాదకరంగా ఉంది. వరికుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి ఉప్పు వాగుపై ఉన్న వంతెన మరమ్మత్తులకు గురై ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జ్ కు పలుచోట్ల పగుళ్లు ఏర్పడి గుంతలుగా దర్శనమిస్తున్నాయి. పగుళ్లు ఎక్కువ అవ్వకముందే సంబంధిత శాఖ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.