Apr 09, 2025, 14:04 IST/
బిహార్లో పిడుగుపాటుకు 13 మంది మృతి
Apr 09, 2025, 14:04 IST
బిహార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బిహార్లోని పలు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై 13 మంది మృతి చెందారు. బెగూసరాయ్, దర్బంగా జిల్లాల్లోనే దాదాపు తొమ్మిది మంది మృతి చెందారు. కాగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారమే హెచ్చరించింది.