

వీరులపాడు: మహాశివరాత్రికి ముమ్మరంగా ఏర్పాట్లు
వీరులపాడు మండల పరిధిలోని జుజ్జారు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ గిరి శిఖర సోమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ కాంతులు వెదజల్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందువల్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు.