
20ఏళ్ల తర్వాత నందిగామలో బార్ అసోసియేషన్ ఎన్నికలు
దాదాపు 20ఏళ్ల తర్వాత నందిగామలో బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకు మునుపు కూడా ఈ ఎన్నికలు జరిగినప్పటికీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. కానీ ఈ సారి న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఈ పరిస్థితి ఏర్పడింది. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది పాలెపు వెంకట నరసింహారావు, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నండ్రు విద్యాసాగర్ బరిలో ఉన్నారు. ఈ రోజు ఉ.9 గం. నుంచి పోలింగ్ ప్రారంభం కాగా. సా.5 గం. వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది.