ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ప్రభుత్వం వేటు
AP: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో సంజయ్ అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. దాంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. కాగా, చంద్రబాబు అరెస్టు సమయంలో సంజయ్ సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంజయ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచింది.