అనంతపురంలో 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
ఏపీలోని అనంతపురంలో జనవరి 9న 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని.. అక్కడ మీ అందరితో బాలకృష్ణ పూర్తిస్థాయిలో మాట్లాడతారని ఆయన తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.