VIDEO: బస్సు నడుపుతూ గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
బెంగళూరులో బుధవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా బీఎంటీసీ డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటుకు గురై సీటులోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ను గమనించిన కండక్టర్ ఓబలేశ్ వెంటనే స్టీరింగ్ పట్టుకుని బస్సును అదుపు చేసి ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. అనంతరం డ్రైవర్ను కాపాడేందుకు కండక్టర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.