

కనిగిరి: బంగారు బాల్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కనిగిరి డివిజన్ పరిధిలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కనిగిరిలో బుధవారం జరిగిన బంగారు బాల్యం శిక్షణ తరగతుల్లో కలెక్టర్, ఎమ్మెల్యే నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చామా? వెళ్ళామా? అని కాకుండా అధికారులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను అమలు చేయాలని సూచించారు.