

పామూరులో వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుండి పామూరులో చెదురు ముదురుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 20 నిమిషాలపాటు ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో పంట్టణంలోని పలు లొతట్టు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు.