సినీ పెద్దలకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
టాలీవుడ్ సినీ పెద్దలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. మూవీ ఇండస్ట్రీకి కీలకమైన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై కఠినంగా వ్యవహరించారు. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. సీఎం నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు నిరాశ చెందినట్లు సమాచారం. రూ.వందల కోట్లతో తెరకెక్కిన సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడం పెద్ద దెబ్బేనని అభిప్రాయపడుతున్నారు.