Top 10 viral news 🔥
పవన్ కోసం మహిళ 500 కి.మీ. సైకిల్ యాత్ర (వీడియో)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఓ మహిళ సైకిల్ యాత్ర చేపట్టారు. ఆమె యాత్ర చేపట్టి మూడో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఏకంగా 500 కిలో మీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ఆదోని నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.