తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు హామీలు రాష్ట్ర ఖజానాపై భారం మోపుతున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే, ఈ కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.20 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అందులో రూ.56వేల కోట్లు గ్యారంటీలకు, మరో రూ.60వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించాం. ఈ క్రమంలో రాష్ట్ర ఖజానాపై భారం పడటం సాధారణం’’ అని సీఎం పేర్కొన్నారు.