మాజీ మంత్రి కాకాణి అనుచరుడి లైంగిక వేధింపులు
AP: మాజీ మంత్రి అనుచరుడు ఓ మహిళను లైంగికంగా వేధించాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ చిరుద్యోగి 2021లో మరణించాడు. భర్త ఉద్యోగాన్ని భార్యకు వచ్చేలా, ఇతర ప్రయోజనాలు అత్తమాలకు వచ్చేలా వెంకటశేషయ్య రాజీ కుదిర్చాడు. ‘లైంగిక వాంఛ తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని అతడు బెదిరించాడు. గత్యంతరం లేక అంగీకరించడంతో.. నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు’ అని బాధితురాలు పేర్కొంది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.