రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై అప్పు రూ.1,29,599
తెలంగాణలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. జాతీయ సగటు రూ.90,372గా ఉంది. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92శాతానికి పెరిగింది. ఇందులో జాతీయ సగటు 52%. దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ (92%), ఆంధ్రప్రదేశ్ (86%) తొలి రెండు స్థానాలలో ఉన్నాయి.