సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఉన్న వీడియోను చైతన్య అనే వ్యక్తి ‘దేవుడికి ఇష్టం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. మళ్లీ చెప్తున్నా ప్రాణగండం ఉంది.’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై తిరుపతికి చెందిన ఎస్.పద్మనాభన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.