Top 10 viral news 🔥
కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజీ.. ఎందుకంటే?
AP: ఓ స్వామీజీ ఒంటిపై కారంతో అభిషేకం చేయించుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో శివస్వామి బాబా అభిషేకం చేయించుకున్నారు. ప్రత్యంగిరా దేవికి కారం ఇష్టమని ఇక్కడ భక్తుల విశ్వాసం. దీంతో స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజు శివస్వామి బాబా భక్తుల చేత కారంతో అభిషేకం చేయించుకోవటం ఆనవాయితీగా వస్తుంది.