Mar 11, 2025, 03:03 IST/
స్టార్ హీరోకు గాయం.. ‘వార్2’ విడుదల వాయిదా!
Mar 11, 2025, 03:03 IST
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2’. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో పాట రిహార్సల్స్ చేసే సమయంలో హృతిక్‌కు గాయాలైనట్లు సమాచారం. దీంతో సినిమా షూటింగ్‌కు నెల రోజుల పాటు బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.