రేపటి నుంచి వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. బుధవారం నుంచి వరుస సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి, 3వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఈ నెల 13 వరకు దసరా సెలవులు ఉండగా.. తెలంగాణలో ఈ నెల 14 వరకు సెలవులు ఉండనున్నాయి. తిరిగి ఏపీలో 14న, తెలంగాణలో 15న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి.