గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు: పయ్యావుల
AP: ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత ఐదేళ్లలో చూశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బడ్జెట్‌పై ఆయన శుక్రవారం శాసనసభలో ప్రసంగిస్తూ.. ‘ఐదేళ్ల పాటు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది. కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులు కూడా చెల్లించలేదు. సాగునీటి ప్రాజెక్టులను పక్కన పెట్టింది. పోలవరం పనులు నిలిపివేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారణమైంది.’ అని మండిపడ్డారు.