AP: శాసన మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా రగడ జరిగింది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపులపై ప్రభుత్వ విధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. దీనిపై మంత్రి సత్యకుమార్ సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో ప్రచారాలు చేశారే తప్ప కాలేజీలు కట్టలేదన్నారు. 26 జిల్లాల్లో కళాశాలల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం స్థలాలను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టారని మండిపడ్డారు. దాంతో వైసీపీ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు.