చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో కోట్లలో గోల్ మాల్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ICICI బ్రాంచిలో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్ హరీశ్ ఆధ్వర్యంలో రూ. కోట్ల నగదును ఖాతాదారుల అకౌంట్ల నుంచి తస్కరించినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడటంతో గురువారం బాధితులు పెద్ద ఎత్తున బ్యాంకుకు వచ్చి ఆందోళనకు దిగారు.14 మంది ఖాతాదారులు రూ.6.90 కోట్ల నగదు, 115 సవర్ల బంగారం మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.