చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేధ్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అర్చకుడి భృతిగా రూ.7 వేలు, పూజలకు రూ.3 వేలు వినియోగించనున్నారు. ఈ నగదు మొత్తాన్ని ఆలయ అర్చకుడి బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తారు. దీని వల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరగా.. ప్రభుత్వంపై ఏటా రూ.32.40 కోట్ల భారం పడుతుంది.